
గౌతమీ తీరాన,
ఏకాంత సమయాన.. విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా,
సాగే ప్రవాహంలా.. తేలే ఊహల్లో నేను,
గూటికి చేరే పక్షులు,
విహరించే చేపలు,
నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే... చెలి రాదే అని,
చెంత చేరదే అని..?
వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...
కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,
తలచే తలపుల,
కలచే కలవరింతల స్రవంతి నా గుండెల్ని...!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి