ఆదివారం

'పదహారు ప్రాయం'


ఊహల ఉయ్యాలలో ఊగుతూ
ఆసల రెక్కలపై
హద్దుల తీరాలను దాటి
అన0తాల ఆన0దాలను కోరుతూ
కలల లోక0లో విహరిస్తూ
కవిత,గానాలలో....స్నేహితుల సరాగాలలో
మధురానుభూతులు పొ0దుతూ
నిన్న జ్నాపక0 గా
రేపు అద్భుత0గా
ఊహి0చేదే .......'పదహారు ప్రాయ0'

గాయపడిన నమ్మకాలు


నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను


ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

స్నేహం


మనసు చచ్చినా మనిషి చచ్చినా మారిపోని బాసలు
చెరిగి పోనీ ఊసులు మావి
ఆకాశం లోతు ఎంత అంటే అంతు చిక్కని ఆవలి వైపుగా
మీ స్నేహానికి వయసు ఎంత అంటే కడకట్టే కాలే వరకు
కన్నీటి బొట్టు రాలే వరకు