మంగళవారం

మరణం


ఋతువులను గుర్తించనపుడు ప్రతిద్వానించనపుడు
ఓ వృక్షం మరణిస్తుంది
పారే దరి దొరకనప్పుడు దాహం తిర్చనపుడు
నీరు మరణిస్తుంది
ఒక్క పంటను పండించ నప్పుడు కొత్త పంటకు వెలుగు చూపనపుదు
భూమి మరణిస్తుంది
ఆశ్చర్యం సడలి నప్పుడు జీవనోస్తాహం ఉడిగి నప్పుడు
మనిషి మరణిస్తాడు

కవితక్షరాలు


నిట్టుర్పులతో గుండె పగుళ్ళు తీసి
దుక్కం గొంతు ముగా పోయినపుడు
కన్నీటి తీగలకు వికసించిన కవితాక్షర పూలు
పరిమళాలను
వేద జల్లి గయా పడ్డ గుండెకు
అమృత
స్పర్శను అందిస్తాయి
నా ప్రతి శ్వాస కవిత్వమై
జీవితమంతా కవిత్వం లో నే జీవిస్తాను
ఆగాధ
లోయలలోకి జారిన
వెంట పడిన కవిత స్పర్శ ఉయలుగిస్తుంది
నా
మస్తిష్కం లో
కవితక్షరాలు
కను మరుగైతే
జీవన
శ్వాస ఆగి మరణిస్తాను

స్నేహం కోసం


అలల ప్రయాణం
తిరం వరకు
కళల ప్రయాణం
మెలుకువ వరకు
మబ్బుల ప్రయాణం
కురిసే వరకు
మనసు ప్రయాణం
కలిసే వరకు
మనిషి ప్రయాణం
మృత్యువు వరకు
సృష్టి ప్రయాణం
ప్రళయం వరకు
ఈ స్నేహం ప్రయాణం
కాలం అందని అంచుల వరకు

ఏమి సదించావని


ఏమి సదించావని
గావు కేకల గానం
వాదించి ఓడ లేక కాదు మౌనం
దరికో దిక్కువెంట దిక్కు తోచని నీ పయనం
చెదిరిన మనసు
బదించిన
మనపై
రాసిందిలా వనం

మరణం ఒక ప్రారంభం


క్షణ క్షణము మరణిస్తూ
క్షణ క్షణము జీవిస్తుంటాను
మరణమే కదా జీవితానికి ప్రారంభం
ప్రతి రాత్రి ఒక మజిలి
చుక్కల్ని చంద్రుణ్ణి మోసుకొచ్చే పల్లకి
కలలకి ఉపిరి పోసే విరంచి
రాత్రి మరణిస్తేనే ఉదయానికి జీవితం
ఎవర్ని ఉద్దరించదు
ఎవర్ని వేదించదు
తనని తను సమర్పించుకుంటుంది
తన బతుకు తాను బతుకుతుంది పువ్వు
ఎవరైనా ఎంత కాలమని
కొంతైనా మరణించాలి కదా
జీవితానికి విలువ కలిపించాలి కదా
చిరు నవ్వే శాశ్వతమైతే
కన్నిటికి విలువేది ?
అంతం కోసం ఒక్కసారైనా ప్రయత్నించాలి
బతుకుతూ మరణాన్ని అనుభవించాలి

విజయం


అందరు నిద్రించే టప్పుడు నువ్వు మేల్కొని వుండు
అందరు మేల్కొని వున్నపుడు
నువ్వు వెలుగై వుండు
ఒక్కోటి
నుటక్కటి విజయాలు ఎన్ని వచ్చినా
నువ్వు నువ్వు గానే ఉండు
తరగని చెదరని విశ్వాసం తో
మరో చరిత్రకు
మరో విజయానికి
మున్ముందు ఉండు

స్నేహం


వికసించిన పువ్వు వాడిపోతుంది
ఉదయించిన సూర్యుడు అస్థమిస్తాడు
వెన్నల తరువాత చీకటి వస్తుంది
కాని !!
స్నేహం అనేది వాడిపొయే పువ్వు కాదు
అస్థమించే సూర్యుడు కాదు
గమ్యమెరుగని చీకటి కాదు
స్నేహం అనేది కలకాలం మనల్ని బ్రతికించే, ముందుకి నడిపించే అమ్రుతబండాగారం

పరిచయం


చిరు పలుకుల మన పరిచయం
బావమై నా యదను తడిమి
కవితల కాలము కదిలి
మేగమై నను విడి
వర్షమై నిన్ను చేరగా
చిగురించిన మన స్నేహం
శిషిరానికి తొలి కమలం
నా హృదయానికి నవోదయం