మంగళవారం

నీకై


నువ్వు పువ్వై పరమలిస్తే
నేను తుమ్మెదనై నిన్ను ఆస్వాదిస్తాను
నువ్వు చినుకై కురిస్తే
నేను భూమినై నిను నాలో దాచుకుంటాను
నువ్వు ఇంద్రదనస్సువై వెలిస్తే
నేను ఆకాశమై నిన్ను అందుకుంటాను
నీకు తోడుగా
నిను ఎప్పటికి వీడని నీడగా నిలిచిపోతను
నీ చిరునామా నేనని చెప్పెఅంతగా
నిన్ను ప్రేమిస్తున్నాను

ఒట్టు నాకనిపిస్తుంది


ఒట్టు నాకనిపిస్తుంది .....
నన్నయ ఒక సారి అమ్మయ్య అనుకున్నట్టు
పెద్దన తాంబూలం లో తెలుగు వక్క పలుకులు వేసుకున్నట్లు
శ్రీ నాదుడు కనకాభిషేకం చేసొచ్చి తెలుగు తల్లి పదాలు ముట్టుకునట్లు
శ్రీ శ్రీ ఘాటుగా రెండు దమ్ములు లాగినట్లు
చెలం గెడ్డాన్ని సవరించుకున్నట్లు
ఇంకా...
విశ్వనాధ మన బాష కి ఒక్కల్లిచ్చేదేమిటి హోదా !
అని గర్గింజినట్లు
ఒక సనాతన పరిమళం ఆవరించి తెలుగు నెల పులకరించినట్లు
ఈ సంతోష సమయంలో నా కళ్లు చేమర్చినట్లు
ప్రాంతీయ బేదాలు మరిచి తెలుగోల్లంతా
కలిసి చెయ్యెత్తి జై కొట్టినట్లు
ఒట్టు నాకనిపిస్తుంది .....

కన్నీటి ఆవేదన


ఒక నీటిచుక్క కను చివరి నుంచి చెక్కిలి మీదకు నీతో అన్నది
ప్రీయతమా !
ఇన్నాళ్ళు
నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండి పోయాను
ఎన్నో
అనుభవాలని నీతో పంచుకుంటూ వచ్చాను
విశదమైన , అనందం మరి ఎక్కువైనా బయటకి రావడానికి ప్రయత్నించాను
కానీ
నిన్ను మాత్రం వదిలి వెల్ల లేక పోయాను
స్నేహితుడా !
రోజు నీ గుండెల్లో ఉభుకుతున్న ఆవేదన తరంగం నన్ను కుదిపి వేస్తునది
భయటకు
తోసేస్తుంది
నేను
కదిలి జారి కారి ఆవిరై పోతాను
నేనిలా
వెళ్లి పోవడం
నీ మనసులో మాత్రం ఉరట నిచ్చిన
మిత్రమా
నా కంత కన్నా కావలిసిందేముంది

అమ్మాయిలు


కొందరు అమ్మాయిలు లాంగ్ టూర్ బస్సులు
దేగ్గరి స్టేషన్ లో దేగిపోయే వారికీ చోటు ఉండదు


కొందరు అమ్మాయిలు బెనారస్ పట్టు చీరలు
వీరిని చూడగానే మహోగాతనికి గురిఅవుతారు


కొందరు అమ్మాయిలు బంగారు ఫ్రేముల్లో బిగించిన కలర్ ఫోటోలు
ఏ డ్రాయింగ్ రూమ్ లో ఐన అలంకరించు కోవచ్చు

కొందరు అమ్మాయిలు అందమైన పద్యాలూ
చదివిన కొద్ది ఎన్ని అద్బుత సౌందర్యాలు అనుబూత మవుతాయి

కొందరు అమ్మాయిలు పడమటి వాయువులు
మౌనంగా నీ హృదయన్ని తాకి దూరం గా తరలి పోతారు

కొందరు అమ్మాయిలు రంగుల చేపలు
మొసళ్ళ నవ్వుల భయం తో నిద్ర లేని జీవితాన్ని గడుపుతారు

కొందరు అమ్మాయిలు గంధపు చెట్లు
తమ నీడలో పాములను పెరగనిస్తారు

కొందరు అమ్మాయిలు అంతరాత్మలు
ప్రతి సన్నివేశానికి వివరణలు అడుగుతారు
తమ దేహానికి తామే శిలువ వేసుకుంటారు

కొందరు అమ్మాయిలు బేగం ఆఖర్ గజల్లు
అందరు ఆనందించలేరు

కొందరు అమ్మాయిలు తల్లుల నిట్టూర్పులు
ఎప్పుడు వ్యర్ధం గా ఆకాశం లో సంచరించే పాలపుంతలు