శనివారం

నేనున్నాను


పూస్తున్న పూవుల్లొ చూడు .. నేనున్నాను

పసిపాప నవ్వుల్లొ చూడు..నేనున్నాను

ఘల్లుమన్న మువ్వల్లొ చూడు..నేనున్నాను

ఝల్లుమన్న నీ గు0డెల్లొ చూడు...నేనున్నాను

అనుక్షన0 నీతోనే వున్నాను

ప్రతి క్షన0 నీతోడై వున్నాను...నీ నీడై వున్నాను


మొదటి సారి చూసిన వేళ



ఎన్నాల్లొ ఎదురుచూసిన తరుణ0తరలి వఛ్ఛి0ది

నా కోస0తీసుకొఛ్ఛి0ది మధుమాసం

ఎన్నో చెప్పాలనుకున్నాను ఆ క్షణం

చెప్పలేక తడబడుతున్నాను ప్రతి అక్షరం

కానీ మాటలన్నీ మౌనలై తనని పలకరి0చాయి

ఆ క్షణ౦ చెప్పలేక తడబడుతున్నాను ప్రతి అక్షర౦

కానీ మాటలన్ని మౌనాలై మదిలోని భావాలన్ని నవ్వులై

ఊసుల్ని తెలిపాయి పట్టలేని ఉద్వేగ0 తో రెప్పలేమో వాలిపోయాయి

తన చూపులో నాచూపు కలసి చెక్కిల్లు చిక్కబడి పోయాయి

ఆ మనసుతో ఈ మనసు చిక్కుబడి ముడిపడిపోయాయి

నా చెలి నన్ను వద్దన్నా రోజు



నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......

తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...

గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితుడిలా నిలుచున్నాను

ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

మన స్నేహం




ఎంత పరుగులెట్టినా
తెలిసీ..ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు నేను కోరే మజిలీ నీ జ్ఞాపకం

ఎంత దూరమెళ్ళినా
గతంపై ఎన్ని రంగులద్దినా
అప్పుడప్పుడు తరచి చూసే పేజీ మన స్నేహం

లేఖ


నీ లేఖలో ని ప్రతీ వాక్యం

ఎన్ని కబుర్లు చెబుతుందో

నిశ్శబ్ధం గా


ఎన్ని జ్ఞాపకాలను తడుతుందో

ఇరికించి మరీ రాసే అక్షరాలు

ఎంత ఆప్యాయతను చూపిస్తాయో

చదివిన ప్రతీ సారీ

మదిలోఎన్ని రంగులను

నింపుతున్నయో


అల్మారాలో,బట్టల మడతల్లో

పరుపు క్రింద,ఫొటోల వెనుక

ఎక్కడ చూసినా నీ అక్షరాలే

వాటి తాలూకూ పరిమళాలే

ఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూ

నా దగ్గరగానువ్వు


-స్నేహం తో

నీ చిరు నవ్వు

ఎలా చెప్పను


ఏమని చెప్పను ఎలా చెప్పను..

మాటలకందని ఆవేదన..

దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని..

ఇనుప సంకెల్ల్లను కసిగా తెంచాలని..

ఈ రక్తమాంసదేహం నుండి విమూక్తి పొందాలని..ఏదో సాధించాలని..

మదిలొ అలజడి..

ఎవరో చెప్పారు..

మదిలొని భావాలని వ్యక్తపరచలేని

అసహాయతను మించిన పేదరికము మరొకటిలేదని..

Some Days



some days i want to live
some days i wish it’s over
some days i long to see
some days i wait to die;

some days i think i am fine
some days i believe i have a problem
some days i am strong
some days i am weak;

some days i am closer to truth
some days it seems far far away
some days i think i understand
some days i am just lost;

some days i just wish
everything would disappear
some days i just hope
you could be near;

some days i have a feeling
one day everything
will be alright
and that day is closer
than ever;


ఒక్క క్షణం చాలు

నీ ఓరచూపుకి
మత్తెక్కి చిత్తైన నా మనసు
నీ చిరునవ్వుకి
రెపరెపలాడి కొట్టుకొంటోంది
నీ సమక్షంలో నాకు
ఇంకొక్క క్షణం గడిస్తే చాలు
నీ కనురెప్పల చాటున చేరి
ఓ స్వప్నం లిఖించడానికి

Last night’s dream


with my eyes closed,
into the darkness of night,
I felt a hand trying to
slowly wake me up;

through the dark,
I saw you smile
and felt my heart
beating like never before;

you look into my eyes,
tell me you love me,
and for a moment time stood still
as I held you in my arms;

and when I finally kissed your lips
I felt like I could breathe again
I knew I had another chance
to make things right in my life;

with the fears of yesterday chased away,
thoughts of you fill my senses and
dreams of only you and me
start to fill my night;

as the world watches in envy,
the feeling of falling asleep in your arms
and waking up in your embrace
makes me forget every little problem in life;

as the first rays of the day stream in,
I only wish when I open my eyes,
from last night’s dream, you and me
become a reality and not just a dream!

నేస్తం



ప్రేమ సౌధం కుప్పకూలి...,
గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచక
హఠాత్తుగా ఆవరించిన శూన్యతకి ఒంటరైనమనసుతో... ఒక నేస్తం...

పచ్చ నోట్లు పలచనై,
బతుకు బండి భారమై,
అలసిన వదనంతో... ఒక నేస్తం...

సంసార సాగరం ఈదుతూ,
గజిబిజి నడకలతొ బిజీ-బిజీగా సతమతమవుతూ... ఒక నేస్తం...

కాల ప్రవాహంలొ కొట్టుకుపోతూ...
నిన్నటి జాడ మరచి, తోడు విడిచి...
కొత్త స్నేహాలతో వర్తమానంలొనే గడిపే... ఒక నేస్తం...

ఒకరితో కాలాన్ని పంచుకోలేక...
ఒకరితో పంచుకుని...
బరువెక్కిన హృదయంతో నేను...

ఎంతమంది నేస్తాలున్నా...
ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...
కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది...

నాతో కబుర్లు చెప్పాలని...
నన్ను అలరించాలని...
బరువైన ఈ క్షణాన్ని తేలిక చేయాలని...

నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను..


సంధ్యా పవనం
నీ కురులని సుతారంగా కదిలిస్తున్నప్పుడు...



వేకువ చలి

నీ చేతులతో నిన్ను నువ్వు చుట్టుకునేట్టు చేస్తున్నప్పుడు...


ఉదయించే సూరీడు
నీ నుదుటి బొట్టుని చూసి, తన ప్రతిబింబమని మురిసిపోతున్నప్పుడు...


కూసే పక్షులు
నువ్వు చలిలో వణుకుతూ చేసే ప్రార్ధనా గుస-గుసలు విని ఎవరీ కొత్త పక్షి అని ఆశ్చర్యంతోఅన్నీ నీ వైపు చూస్తున్నప్పుడు...


తొలి మంచు
నువ్వు గుడి చుట్టు ప్రదక్షిన చేస్తుండగ
నీ చెంప వాలున జారే చెమట బొట్టు మీద కిరణాలు పడి మెరిసిపోతుంటే
అది చూసి అసూయ పడుతున్నప్ప్పుడు...

నేను ఆ ప్రకృతిని మిస్స్ అవుతున్నాను...
నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను...

గౌతమీ తీరాన


గౌతమీ తీరాన,
ఏకాంత సమయాన..
విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా,
సాగే ప్రవాహంలా..
తేలే ఊహల్లో నేను,
గూటికి చేరే పక్షులు,
విహరించే చేపలు,

నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే...
చెలి రాదే అని,
చెంత చేరదే అని..?

వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...

కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,

తలచే తలపుల,
కలచే కలవరింతల స్రవంతి
నా గుండెల్ని...!

నాలోనే ఉన్నావు...


నీ తలపుల తారలెన్నో నా హృదయాకాశం లో...
నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...
రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...
నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...
భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని... నీ కలలతో,
తలపులతో,
విరహంతో
ఈ క్షణం నిలిచిపోని... కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...?
నీ రాకకై...