సంధ్యా పవనం
నీ కురులని సుతారంగా కదిలిస్తున్నప్పుడు...
వేకువ చలి
నీ చేతులతో నిన్ను నువ్వు చుట్టుకునేట్టు చేస్తున్నప్పుడు...
ఉదయించే సూరీడు
నీ నుదుటి బొట్టుని చూసి, తన ప్రతిబింబమని మురిసిపోతున్నప్పుడు...
కూసే పక్షులు
నువ్వు చలిలో వణుకుతూ చేసే ప్రార్ధనా గుస-గుసలు విని ఎవరీ కొత్త పక్షి అని ఆశ్చర్యంతోఅన్నీ నీ వైపు చూస్తున్నప్పుడు...
తొలి మంచు
నువ్వు గుడి చుట్టు ప్రదక్షిన చేస్తుండగ
నీ చెంప వాలున జారే చెమట బొట్టు మీద కిరణాలు పడి మెరిసిపోతుంటే
అది చూసి అసూయ పడుతున్నప్ప్పుడు...
నేను ఆ ప్రకృతిని మిస్స్ అవుతున్నాను...
నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి