శుక్రవారం

ప్రియా


ప్రియా

సూర్యుడు కనపడగానే మనసారా విచ్చుకొని తన ప్రేమను తెలియ చేస్తుంది పద్మం .

మద్యానం వరకు ఆగుదంలె అని అనుకోదు.

చంద్ర కాంతిని చూడగానే విప్పారి తన ప్రేమను చంద్రునికి తెలియ చేస్తుంది కలువ

నది రేయి వరకు వేచి ఉందాము అని అనుకోదు .

ప్రకృతిలో అంట నిర్మొహమాటం .

ధైర్యం ఉన్నాయి.

ఎందుకో మనుషులకు మాత్రం మనసులో మాట చెప్పాలి అంటే

కలాం వచ్చే వరకు ఆగాలి అంటారు

ప్రకృతిని స్పూర్తి గా తీసుకోని లేక రాస్తున్నాను .

మిమల్ని చూసిన మరుక్షణమే నా మనసు స్పందించింది

నాతో అన్ని కాలాల్లో మీరు తోడుగా ఉండాలి అనిపించింది

మీ మనసు వేరొకరికి ఇవ్వకుండా ఉంటే

నా మీద మీ అభిప్రాయాన్ని తెలపండి .

మీ మనసును వేరొకరికి ఇచ్చేసి ఉంటే మౌనం గా ఉండండి .

మీ మౌనం అర్ధ అంగి కారం భావించి జీవిత కలం ఎదురు చూస్తాను

ఎంత మార్పూ


నాకు తెలియకుండా నాలో ఎంత మార్పూ

నాకే ఆశర్యం వేస్తుంది

ఆకలి అన్నది మర్చిపోయాను

ఆలోచనలతో కాలం గడుపుతున్నాను

అనుక్షణం నీ ఆలోచనలతో

ప్రతి క్షణం పరవశిస్తున్నాను

నేను గొప్ప ప్రేమికుడిని అన్నా గర్వం

దానికి ఒక్కటే కారణం

నువ్వు తప్ప వేరెవరు నా ఆలోచనలో లేకపోవడం

ఆశ


నిన్ను చూడాలని ఉంది

కానీ నీకు కనపడాలని లేదు

ఐన ఒక్కసారి

నీకు కనపడాలని

నువ్వు నన్ను చూస్తున్నప్పుడు

శతకోటి బావలు ప్రదర్శించే నా కళ్ళలో వెలుగు మాయమై

నిస్తేజమైన చూపు మిగిలి ఉంది అని

ఆ చూపులో జీవం లేదని

నువ్వు గమనించ గలవో లేదో అని గమనిస్తే

నీ నయన ప్రతి స్పందన చూడాలని నాకు ఆశగా ఉంది


నీ గొంతు వినాలని ఉంది

కానీ నీతో మాట్లాడాలని లేదు

ఐన ఒక్కసారి నీతో మాట్లాడాలని

నువ్వు నా మాటలు వింటున్నప్పుడు

గలగల సెలయేరుల మాట్లాడే నేను

ఒక్కొక్క పదం పలకడానికి

ముగాదనిలా ఆత్యంత కష్ట పడుతున్నాను అని

అనురాగాన్ని బదులు వైరాగాన్ని మీతుతున్నాను అని

నా పలుకులలో రాగం లేదని

నువ్వు గమనించగలవో లేదో అని

గమనిస్తే నీ పేదల కదలిక చూడాలని

నాకు ఆశగా ఉంది





వరం


చిరునవ్వు లాంటి నీ స్నేహం

నాకు దేవుడిచ్చిన వరం

నీ స్నేహం అంతులేనిది

అతితమైనది


స్వార్థం
లేనిది

అలాంటి
నీ స్నేహం

ఎప్పటికి


నాకు
ఈలాగే ఉండాలని ఆశిస్తూ

ఎప్పటికి నిన్ను మర్చిపోలేని

నీ నేస్తం

మౌన రాగం


ఎన్నో రాగాలూ

ఏవేవో గీతాలు

వినిపిస్తున్న ,వినమంటున్న

ఎందుకె మానస ఈ మౌన రాగం




అలసట ఎరుగని మనిషి మనసనే తెరాన్ని చేరాలని

తపించిన నీ వాళ్ళని

జపించిన మీరంతా నా వాళ్ళని

తరించలేవని తెలిసినందుక మానస

ఈ మౌన రాగం





కళల ఓ కదల చేరువై మరుగై పోయిన నేస్తమా

నే చేసిందంతా నేరమా

పలుకవేమి నా ప్రాణమా

ఎంతగ పిలిచినా బదులే రాదని తెలిసినందుక మానస

ఈ మౌన రాగం