నిన్ను చూడాలని ఉంది
కానీ నీకు కనపడాలని లేదు
ఐన ఒక్కసారి
నీకు కనపడాలని
నువ్వు నన్ను చూస్తున్నప్పుడు
శతకోటి బావలు ప్రదర్శించే నా కళ్ళలో వెలుగు మాయమై
నిస్తేజమైన చూపు మిగిలి ఉంది అని
ఆ చూపులో జీవం లేదని
నువ్వు గమనించ గలవో లేదో అని గమనిస్తే
నీ నయన ప్రతి స్పందన చూడాలని నాకు ఆశగా ఉంది
నీ గొంతు వినాలని ఉంది
కానీ నీతో మాట్లాడాలని లేదు
ఐన ఒక్కసారి నీతో మాట్లాడాలని
నువ్వు నా మాటలు వింటున్నప్పుడు
గలగల సెలయేరుల మాట్లాడే నేను
ఒక్కొక్క పదం పలకడానికి
ముగాదనిలా ఆత్యంత కష్ట పడుతున్నాను అని
అనురాగాన్ని బదులు వైరాగాన్ని మీతుతున్నాను అని
నా పలుకులలో రాగం లేదని
నువ్వు గమనించగలవో లేదో అని
గమనిస్తే నీ పేదల కదలిక చూడాలని
నాకు ఆశగా ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి