శుక్రవారం
విరహం
ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసింది
చెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...
వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...
చల్ల గాలులు, కారు మబ్బులు లేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...
చెలి దూరంగా వుంది తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...
చెలీ రావే,వరాలీవే,
వెతికా నిన్ను వీచే గాలుల్లో కన్నా నిన్ను కారు మబ్బుల్లో... వెచ్చదనం ఏదని?
వెన్నెల రాదే అని? చెలీ రావే,వరాలీవే...
మీకు తెలుసా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)