క్షణ క్షణము మరణిస్తూ క్షణ క్షణము జీవిస్తుంటాను మరణమే కదా జీవితానికి ప్రారంభం ప్రతి రాత్రి ఒక మజిలి చుక్కల్ని చంద్రుణ్ణి మోసుకొచ్చే పల్లకి కలలకి ఉపిరి పోసే విరంచి రాత్రి మరణిస్తేనే ఉదయానికి జీవితం ఎవర్ని ఉద్దరించదు ఎవర్ని వేదించదు తనని తను సమర్పించుకుంటుంది తన బతుకు తాను బతుకుతుంది పువ్వు ఎవరైనా ఎంత కాలమని కొంతైనా మరణించాలి కదా జీవితానికి విలువ కలిపించాలి కదా చిరు నవ్వే శాశ్వతమైతే కన్నిటికి విలువేది ? అంతం కోసం ఒక్కసారైనా ప్రయత్నించాలి బతుకుతూ మరణాన్ని అనుభవించాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి