సోమవారం

ఏదో ఒకటి చెయ్యాలి


ఏదో ఒకటి చెయ్యాలి
తల్లడిల్లుతున్న ఈ పసి పూలను
కనీసం ప్రేమగా అరచేతులోకి తీసుకోవాలి
రెక్కలు విరిచి
అక్షరాలు అతికించిన
ఈ సీతకోకచిలుకల్ని తీసుకెళ్ళి
పచ్చని మైదానం లో అలంకరించి వస్తాను
కాళ్ళు విరిచి
గోడ కుర్చీ వేఇంచిన కుందేళ్ళను ఎత్తుకెళ్ళి
వెన్నల వాకిట్లో
దాగుడుమూతలు నేర్పుతాను
ముక్కు పచ్చలారని మొగ్గాలకి
ఇనుప రెక్కలు తొడిగి
కొరడాలతో స్వారిచేస్తున్న రాక్షసుల్ని
పడు బావి లోకి విసిరేసి వస్తాను .
ఏదో ఒకటి చెయ్యాలి
తల్లడిల్లుతున్న ఈ పసి పూలను
కనీసం ప్రేమగా అరచేతులోకి తీసుకోవాలి

ఏడుపు ఓ ప్రోగ్రామర్ అత్మగోష


ప్రోగ్రామర్ : అంత మీరే చేశరు .... మొత్తం మీరే చేశారు ... చాలు సర్ , వచిన్నపటినుంచి నా చేత మీరు చేఇంచింది చాలు! నీను కోల్పోయింది చాలు! ఇంక వద్దు ప్లీజ్ ....!
ప్రాజెక్ట్ మేనేజర్ : కాని నేనేం చేశాను .
ప్రోగ్రామర్ : ఇంక అర్థం కాలేదా మీకు . ఈ కంపెనీ కి వచిన్నపుడ్డు నా దెగ్గర ఏముందో ఇప్పుడు ఏమి లేదో . అదే సర్ నేను కోల్పోయింది ..... ప్రోగ్రామింగ్ స్కిల్ . చిన్న చిన్న ప్రోగ్రాములు రాయడం కూడా మర్చిపోయాను సర్ మీ వల్ల .
మీరెప్పుడు మీ టీం చేత గొప్ప గొప్ప ప్రాజెక్ట్ లు చేఇంచాలని ఆలోచిస్తారు తప్ప ... నాకేం వచ్చో నేనేం చెయ్యగలనో తెలుసుకోరు . కానీ వర్క్ చెయ్యలేకపోతే అందులో ఉండే బదేంతో నాకు తెలుసు. అసలు నాటో మాట్లాడితేగా నా భాదేంటో మీకు తెలియడానికి . ఏదైనా సమస్య వస్తే టీం లో ఉన్నా మిగత వాళ్ళను పిలిచి మాట్లాడుతారు.
నాతొ మాట్లాడండి సర్ . నా వర్క్ వర్క్ చూసి చెప్పండి . ఫ్రెండ్లీ గా ఉండండి ..

ప్రాజెక్ట్ మేనేజర్ : కాని నేను అన్ని విషయాలు ఫ్రెండ్లీ గానే చెప్తా కదా !
ప్రోగ్రామర్ : చెప్తారు కానీ అల ఉండరు . ఎందుకంటే అంతమీకు నచినట్టు జరగాలి కదా !
ఇచ్చిన వర్క్ ఎ లాంగ్వేజ్ లో చెయ్యాలో మీరే సెలెక్ట్ చేస్తారు. నాకేల ఉంటుందో తెలుసా ... నాకది రాదు నేను చెయ్యలేను అని గట్టిగా ఆరవలనిపిస్తుంది .
సి++ లో చెయ్యమంటారు . చేసే లోపే మీరే జావా లో ఆ ప్రోగ్రాం చేసుకొచ్చేస్తారు . నవ్వుతున్నారు సర్ నన్ను చూసి , ఆఫీసు లో అంత .
నేనేదో కోడ్ రాస్తాను . కానీ మీరు దాన్ని అందంగా ఎలా రాయాలో చెప్తుంటారు .
నేనెలా రాయాలో కూడా మీరే చెప్తుంటే నేనెందుకు సర్ కోడింగ్ చెయ్యడం !
చివరకు డీబగ్గింగ్ ఎలా చెయ్యాలో కూడా మీరే చేపెస్తుంటే ఒక్కవిషయం కూడా బ్రెయిన్ లోకి కంపైల్ కావడం లేదు సర్ .
మీకు తెలియదు . మీరు చెప్పింది చెయ్యలేక నాకు నచ్చింది చెప్పలేక .... నరకం చూసాను సర్ నరకం .
ఆ కోపం , భాద ఎవరి మీద చూపించాలో తెలియక కిందటి నెలలో మా ఆవిడ మీద అరిచేశాను సర్! పుట్టింటికి వెళ్ళింది ఇంక రాలేదు .
సరే ఇప్పుడు నేను టెస్టింగ్ చెయ్యాలి అంతేగాచేస్తాను . కానీ అది కూడా నేను సరిగ్గా చెయ్యలేనని నాకు తెలుసు సర్.
ప్రాజెక్ట్ మేనేజర్ గా ఇన్నాళ్ళు మీరు గెలిచాను అనుకుంటున్నారు కదా ! కానీ మిమ్మల్ని గెలిపించడం కోసం ఇరవైనాలుగూ నెలలుగా నేను ఒడి పోతూనే ఉన్నాను సార్ .
ఈలా ఓడిపోతూనేఉంటే... మరో రెండేళ్ళకి నా ప్రాజెక్ట్ ఏంట్రా అని చుస్తే అందులో నేనుండను . మీరే ఉంటారు. మొత్తం మీరే ఉంటారు .
సార్ , దయచేసి ...నేను చేయలేని వర్క్ ఇచ్చి నేనేదో చేసెయ్యాలని మాత్రం కోరుకోవద్దు ప్లీజ్ ...!

గురువారం

నడి రేయిలో


చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం
గుప్పెడు మల్లెల వాసనలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
వెచ్చని తలపులు కప్పుకున్న హృదయం
చెప్పలేని పరవశంలో చిక్కుకుని చిరునవ్వులొలికిస్తుంది

ప్రేమ


రెండు హృదయాల మూగ భాష ప్రేమ నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ ఛిలిపిదనాల తీయనైనఅనుభవం ప్రేమ మాట్లాడగలిగే మౌనం ప్రేమ యుగాల నిరీక్షణే ప్రేమ మనసైనవాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ ఆరాధించేది ప్రేమ ఆరాటపడేది ప్రేమ అంతు తెలియనిది ప్రేమ అంతం లేనిది ప్రేమ ఇది నాకు తెలిసిన ప్రేమ నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ కాని...భాష తెలియని భావాలెన్నో ప్రేమన్న రెండు అక్షరాల పదం లో

నాకు నచ్చిన కవితలు


ఎండిపోయిన ఎడారిలో తొలకరి జల్లు కురిపించు జవ్వని ఎవ్వరో…

***

నీ
పై పెదవి ఇంద్రధనుస్సుకున్న
క్రింది పెదవి నారిని
నా నాలిక భాణంతో
మీటేదెన్నడు నారీ…

***

నీ అద్బుతపాదాలనంటుకొని రాలిపోయిన దుమ్ము కూడా ప్రకాశవంతమే.
నీ వెలుగు చిమ్మే కళ్ళల్లోకి నే చూడలేక వంగి నిలుచుంటాను.
కానీ… విచిత్రంగా నీ పాదాలు నన్ను పలుకరిస్తాయి, నన్ను నిలువరిస్తాయి…
చివరికి స్వప్నంలో కూడా నన్ను చూడవస్తాయి.

***

నీ
చక్కని చల్లని
చేతి స్పర్ష
కమ్మగా నైనా
కఠినంగానైనా
కలలో నైనా
నా చెంపను తాకితే..
ఊహకు అందని ఆ అనుభూతిని
ఏమని వర్ణించను..

***

ఊపిరి తీయకుండా
ఆగగలను క్షణమైనా
ఆగలేను నీ తలపులు లేక

***

నాలోని హృదయం నాదా నీదా
అని సందేహమొచ్చింది
ఎందుకంటే..
అది నాకంటే నీగురించే ఎక్కువ ఆలోచిస్తోందే..

***

నా హృదయాన్ని
దారానికి గుచ్చి
వెతుకుతున్నాను,
నిన్ను అలంకరిద్దామని..
ఎంతకూ కనిపించవేం?

***

సాయంత్రవేళ సముద్రఘోష
పౌర్ణమినాటి పండువెన్నెల
నది ఒడ్డున ఇసుకతిన్నె
నిన్నె గుర్తుకు తెస్తున్నాయి
నీ చెలి ఎప్పుడొస్తుందని
నన్ను అడుగుతున్నాయి

***

సామ్రాజ్యాధిపత్యమా
నీ చెలి సాంగత్యమా
అంటే
నా చెలి సాంగత్యమే
నాకు మక్కువంటాను!

***

ఒంటరివాడనని
వెక్కిరించే
ఓ పిల్ల తిమ్మెరా?
నా ఊపిరినిండా
వూహలనిండా
నా చెలేనన్న సంగతి
తెలియదా?

***

రక్త మాంసాదులతో
ఏర్పడిన దేహం నీదంటే
నేనొప్పుకోను
నీ రక్తంలో అమృతాన్ని
నీ కళ్ళల్లో వెన్నెల గుళికనీ
నింపి వుంటాడు
ఆ బ్రహ్మ!

***

ఓ నెచ్చలీ
నీ వెచ్చని ఆలోచనలతో
నిద్రే రాకున్నది
నీ వెచ్చని కౌగిలిలోనూ
నిద్రరాదు…ఊసులు తప్ప.

***

నేను పుట్టిన వెంటనే
నువ్వు కావాలని ఏడ్చాను
నిన్ను పలకరించాలని మాటలు నేర్చాను
నీకు వ్రాయటానికై వ్రాత నేర్చాను
సూర్యున్ని దివిటీగా
పట్టుకొని
ప్రతిరోజూ నిన్నె వెతుకుతున్నా
పాతిక వసంతాలు
గడిచినా
నీ జాడ లేదు.

***

గల గల పారే సెలయేరు
కిలకిలా రావాల కోయిల
పచ్చని పైరుపంటలు
అన్నీ సింగారించుకొని వచ్చాయి..
సఖీ! ఇక నీదే ఆలస్యం.

***

నా సుఖమూ,
సంతోషమూ,
సఫలత్వమూ,
అన్నింటిలోనూ అసంపూర్ణతే
నీవు లేక, నా జీవితమూ
నేనూ కూడా అసంపూర్ణమే.

***

నేను మూగవానిగా
చెవిటివానిగా
గుడ్డివానిగా అయినా
జీవించగలను…
కానీ
నీ ప్రేమరహితంగా జీవించలేను.

***

ప్రియా!
నీకు తెలిసినా
తెలియకున్నా
నాకు తెలుసు…
నీవు పీల్చి వదిలిన గాలినే
నేనూ పీలుస్తున్నాను గనుక
బ్రతికి వున్నానని.

***

దేవుడు ప్రత్యక్షమై
మూడు వరాలు
కోరుకొమ్మంటే
ప్రేమ
ప్రేమ
ప్రేమ
కావాలంటాను.

***

తల్లి వాత్సల్యాన్ని,
చెల్లి అనురాగాన్ని,
అక్క ఆప్యాయతనీ,
రంభ సౌఖ్యాన్నీ..
ఈ ప్రపంచంలోని
సమస్త సుఖాలనీ ఒక్క
నీనుండే జుర్రుకోగలను ప్రియా!

***

నీకోసం మళ్ళీ మళ్ళీ
మానవునిగానే కాదు
పేడా పురుగుగానైనా
జనిమించగలను,
నాకు తోడుగా నీవు నిలిస్తే.

***

ప్రియా,
నీవూ, నేనూ వేరంటారు
మూర్ఖులు.
కాదు, ఒకే ఆత్మ రెండు ముక్కలుగా
నీలో నాలో వుండబట్టి,
ఒకే దేహం నీ, నా గా విడిపోబట్టి కదా..
నీ,నా ఆత్మలు, దేహాలూ
ఒక్కటవడానికి సదా ఇంత
ఆరాటపడుతున్నాయి.

***

ఓ చెలీ!
నీ వాక్కులే నాకు వేద వాక్కులు
నీ దర్షనమే దైవ దర్షనం
నీ చుంబనమే అమృత సేవనం
నీ సాంగత్యమే స్వర్గ సుఖం
నీ సేవయే నాకు దైవ సేవ!

***

ఏ ఒడిలోనూ
బడిలోనూ
గుడిలోనూ
పొందలేని సౌఖ్యాన్ని
ఇవ్వగల నీకు
ఏ దేవత సాటి రాగలదు?

***

ఓ సఖీ!
నా దేహంలో ప్రాణం నీవు
నా వాక్కులో భావం నీవు
నా పాటకు పల్లవి నీవు
నా జీవిత పరమార్థం నీవు!

***

ప్రేమ తంత్రుల వీణ
నా మనసు
దానిపై రాగాలు పలికించు
కొనగోరు నీవు!

***

ఒక్క క్షణమైనా
నీ సాహచర్యం
నాకు లభిస్తుందంటే
ఈ కంటకప్రాయమైన
మానవ జన్మలను
ఎన్నైనా ఎత్తుతాను!

***

నీ కళ్ళు కురిపించు
ప్రేమధారలలో
మునిగి వుక్కిరిబిక్కిరి
అవుతున్నాను
ప్రియా!
నన్ను అక్కున చేర్చుకొని
రక్షించవా!

***

నీ చూపుల గాలం
నా హృదయాన్ని
గాయం చేస్తోంది
తీసుకో నా హృదయాన్ని
నీ వలపుల బుట్టలో వేసుకో!

***

ప్రియా!
నీవు లేక అష్టైశ్వర్యాలూ
త్యజిస్తాను
నీ సన్నిధిలో చావునైనా
చిరునవ్వుతో ఆహ్వానిస్తాను.

***

నీ వూహలతో
బరువెక్కిన కాలం
కదలడం లేదు
నిన్ను పొందాలన్న
బలమైన కాంక్ష
నన్ను ఊపిరి సలపనివ్వడం లేదు.

***

నిన్ను చూడటానికి కళ్ళు
నిన్ను చేరడానికి కాళ్ళు
నిన్ను వేడుకోవడానికి నోరు
వున్నా
ఏమీ చేయజాలని
నా నిస్సహాయ జీవితం కంటే
రోజూ నీ అందమైన
పాదాలనంటి పెట్టుకొని
తిరుగుతున్న
నీ పాదరక్షల జీవితం
ఎంత గొప్పదో కదా!

***

నీ ముంగురులతో ఆడుకొనే దువ్వెన
నీ వంటిపై నర్తించే సబ్బుబుళ్ళ
నీ పాదాలనంటిపెట్టుకొని వుండే
పాదరక్షల కన్నా
పవిత్ర వస్తువులు
ఈలోకంలో మరేం వున్నాయి?

***

బస్సు గురించో, దారి గురించో
ఆట గురించో, పాట గురించో
పువ్వు గురించో, నవ్వు గురించో
ఆలోచిస్తావు గానీ
నా గురించి ఒక్క సెకనులో
వేయ్యోవంతు ఆలోచించినా
చాలదా ఈ జన్మ సార్థకం అవడానికి?

***

నల్లని మబ్బుల మాటున
దాగిన జాబిల్లీ
వెన్నెల కురిపించు నీ కన్నులు
నీ వునికిని నా కెరుక
పరుస్తున్నాయిలే!

***

ఏ గుడిలోనూ కనిపించని
ఏ దేవతవు నీవు?
ఏమని మొక్కిన
కటాక్షించదవు?

***

ఈ రోజు బస్టాపులో
నిన్ను చూశాను
నీవు విసిరిన వలపు చూపులో
చిక్కుకొని నేను విలపిస్తుండగా
బస్సెల్లిపోయింది
అందులో నీవూ వెళ్ళిపోయావు
నేను మాత్రం బస్టాపులో మిగిలిపోయాను.

***

నా హృదయ మైదానాన్ని
చదును చేసి వుంచుకొన్నాను
నా మనసు కోయిల
వసంతరాగాన్ని ఆలపిస్తూనే వుంది
ప్రేమ పన్నీటి జల్లు
కురిపిస్తూనే వుంది
అయినా…
ఆ మొక్క పూయదేమిటి?
ఈ గులాబీ విరబూయదేమిటి?

***

ప్రేమ ఫలము యొక్క
మధుర రసము గ్రోలాలని ఆస!
కానీ…
ఇంకా చెట్టే కనిపించదే,
ఫలమెప్పుడు దొరికేను?

***

నీ ముద్దొచ్చే పెదవులనీ, బుగ్గలనీ
సూరీడు తన కిరణ బాహువులతో
ఎంత తన్మయంగా తడుముతున్నాడో చూడు!
గాలి తనేమీ తక్కువ తినలేదని
నీ ముంగురులు సవరించి,
చున్నీ లాగుతూ పరాచికాలాడుతోంది!

***

ప్రియా!
వుదయమే నీవు చూసిన ఆచూపు
నన్ను రోజంతా చైతన్యంగా
వుంచిందే…
ఇక నాతో కలిసి నీవు నడిస్తే
ఇంకో పది జన్మల భారాన్నైనా
అవలీలగా మోయలేనా!

***

పల్లవి లేని పాటను నేను
రాగం లేని గీతం నేను
కొమ్మలు లేని మోడును నేణు
వసంతం లేని కాలం నేను
చంద్రిక లేని గగనం నేను
నూవు లేని నేను నేను.

***

ఆనందమున్న చోట దఃఖము
ప్రేమ వున్న చోట ద్వేషమూ
పుడతాయట!
అందుకే నిన్ను ప్రేమించాలన్నా
భయంగా వుంది!

***

ఓ అందమా!
నీ చెంప ఆ చెవిపోగుకు
అందాన్ని తెచ్చింది
నీ పాదం ఆ కాలి అందెకు
మెరుగునిచ్చింది
నిన్ను మోస్తున్నందుకు
బస్సు చూడు
ఎంత విజయగర్వంతో
పరుగెడుతోందో!

***

ప్రియా!
నాకు మోహం లేదు
కామం లేదు
కోరిక అసలే లేదు…
నీ మోము లోకి చూస్తూ
కాలం గడపాలన్న
కాంక్ష తప్ప!

***

రోజూ ఎదో వ్రాస్తున్నాను
నీ మీది ప్రేమను
ఇంతకంటే ఎక్కువగా
తెలియజేయలేకున్నాననే బాధ
నన్ను పీడిస్తోంది.
ఎలా వ్రాసినా అవి నన్ను
వెక్కిరిస్తూ చూస్తున్నాయి.

***

ఈరోజు ఒక విషయం
నన్ను ఏద్చేలా చేసింది
నీకేదో కస్టం కలిగినట్లుగా
నేణు తల్లడిల్లి పోయాను
నీతో చెబితే
నన్ను పిచ్చివాడిగా
చూస్తావేమొ!

***

ఓ నిర్దాక్షణ్య కాలమా!
ఎన్నాళ్ళిలా ప్రేమ ఱంపముతో కోసి
నా హృదయాన్ని గాయపరుస్తావు?
ఎన్నాళ్ళీలా ఒంటరి గానాన్ని
ఆలపించమంటావు?
ఇక నా వల్ల గాదు.

***

నీ సందర్యాన్ని నా రెండు కళ్ళతో
అంచనా వేయాలని చూస్తూ
ఈ ప్రేమగానాన్ని నా నోటొతో
పాడటానికి ప్రయత్నిస్తూ
నిన్ను కీర్తించడానికి
పదాల కోసం వెతుక్కుంటూ…
ఎంత అల్ప ప్రయత్నం చేస్తూ వున్నాను
అనంతమైన సౌందర్యాన్ని
అల్పమైన మాటలతో వ్యక్తం చేయాలని
వ్యర్థ ప్రయత్నం చేస్తూ…

***

నా హృదయం ఎక్కడ పోయిందని
ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను
ఇప్పుడు తెలిసింది
నీవే నా హృదయమని.

***

నా హృదయం
నీచే దొంగిలింపబడాలని కోరుకుంటాను
నీ హృదయాన్ని
నేను గెలవాలని కోరుకుంటాను.

***

నిన్ను చూస్తున్నంత సేపూ
సుమధుర సంగీతం
వింటున్నట్లుగా
గాలి మేఘాలపై
విహరిస్తున్నట్లుగా
నిన్ను చూడనంతసేపూ
చీకటిలో, చిట్టడవిలో
దారికోసం తడుముకుంటున్నట్లూ
వుంటుందేందుకనో!

***

నా కళ్ళు ఏమని భాషిస్తున్నాయో
నీకే తెలుసు?
నీ కళ్ళనడుగు.
నా హృదయం నీకెంత సన్నిహితమో
నీకేం తెలుసు?
నీ హృదయాన్నడుగు.

***

నీ చూపుల గాలులతో
నా హృదయ సంద్రంలో
తుఫాను రేపకు,
నన్ను గాయ పర్చకు.

***

ఈ చీకటితో నెయ్యం
నే చేయలేను చెలీ!
నీవు మోసుకొచ్చే
అమృతభాండము కొరకు
ఎన్ని చీకటి రాత్రులు
ఎదురుచూస్తూ గడపను?

ఆదివారం

'పదహారు ప్రాయం'


ఊహల ఉయ్యాలలో ఊగుతూ
ఆసల రెక్కలపై
హద్దుల తీరాలను దాటి
అన0తాల ఆన0దాలను కోరుతూ
కలల లోక0లో విహరిస్తూ
కవిత,గానాలలో....స్నేహితుల సరాగాలలో
మధురానుభూతులు పొ0దుతూ
నిన్న జ్నాపక0 గా
రేపు అద్భుత0గా
ఊహి0చేదే .......'పదహారు ప్రాయ0'

గాయపడిన నమ్మకాలు


నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను


ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

స్నేహం


మనసు చచ్చినా మనిషి చచ్చినా మారిపోని బాసలు
చెరిగి పోనీ ఊసులు మావి
ఆకాశం లోతు ఎంత అంటే అంతు చిక్కని ఆవలి వైపుగా
మీ స్నేహానికి వయసు ఎంత అంటే కడకట్టే కాలే వరకు
కన్నీటి బొట్టు రాలే వరకు