సోమవారం

ఏదో ఒకటి చెయ్యాలి


ఏదో ఒకటి చెయ్యాలి
తల్లడిల్లుతున్న ఈ పసి పూలను
కనీసం ప్రేమగా అరచేతులోకి తీసుకోవాలి
రెక్కలు విరిచి
అక్షరాలు అతికించిన
ఈ సీతకోకచిలుకల్ని తీసుకెళ్ళి
పచ్చని మైదానం లో అలంకరించి వస్తాను
కాళ్ళు విరిచి
గోడ కుర్చీ వేఇంచిన కుందేళ్ళను ఎత్తుకెళ్ళి
వెన్నల వాకిట్లో
దాగుడుమూతలు నేర్పుతాను
ముక్కు పచ్చలారని మొగ్గాలకి
ఇనుప రెక్కలు తొడిగి
కొరడాలతో స్వారిచేస్తున్న రాక్షసుల్ని
పడు బావి లోకి విసిరేసి వస్తాను .
ఏదో ఒకటి చెయ్యాలి
తల్లడిల్లుతున్న ఈ పసి పూలను
కనీసం ప్రేమగా అరచేతులోకి తీసుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి