శుక్రవారం

ప్రియా


ప్రియా

కోయిల గొంతు విప్పి పాడడం కోసం వసంత కాలం వచ్చే వరకు వేచి ఉంటుంది .

ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ చూసో లేక మరెందుకో నా హృదయం నాతో గొంతు విప్పే కాలం వచ్చుంటుంది .

అసలే సున్నితమైన విషయం ఆ పైన నేను ఆడదానిని కావడం చేతనేమో చాల కాలం తరువాత

కానీ నేనిలా మనసువిప్పలేక పోతున్నాను . తూకం తప్పని మాట , ఆత్మాస్తర్యం నిడిన చూపు ,

ఆకర్షించే హుందా తనం , కట్టి పడేసే చిరునవ్వు , సంస్కారం నిండిన పదజాలం , వెతికినా

కనపడని గర్వం ....... ఇలా చెప్పుకుంటూ పోయే కన్నా మగవారందరికిమీరు ఒక ఆదర్శం అంటే

సరి పోతుంది . మీతో ఏకాంతం గా మాట్లాడాలని ఉంది . ఇంతకూ మించి నేనేమి రాయలేను .

సమ్మతమైతే మన్నించి నా ఈ మెయిల్ కు రిప్లయ్ ఇవ్వండి . ఈదే నా తోలి మరియు చివరి

" పేరు లేని లేఖ "

సదా మిమల్ని అభిమానిస్తూ ......... మీ ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి