గురువారం
ఏరా ఏమనుకుంటున్నావ్
ఏంట్రా ఆసలు ఏమనుకుంటున్నావ్ ?
నన్ను వదిలి వెళ్లి ఎన్నినాళ్ళు అయ్యింది .... ఒక్క ఫోన్ కాల్ ఐన చేసావా ?
ఒక్క ఉత్తర మైన రాసావా ?
అసలు నేను నీకు గుర్తున్నానా ?
.....కనీసం ఒక్కసారైనా గుర్తొచ్చానా ?
గుర్తు రాలేదని మాత్రం చెప్పకు .అబ్బద్దమైన పర్వాలేదు .
ఎప్పుడు నేనే గుర్తువస్తున్నాను అని చెప్పు .
నాకైతే ప్రతి క్షణం నీ ద్యసే .....
నిత్యం నీ జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తుంటే పరద్యనం లో ఉంటునాను అని తిడుతున్నారు అంత.
నీ కిష్టమైన నా కన్నులు నీ కోసం ఎదురు చూపులు చూస్తున్న ఈ .
నువ్వు దెగ్గరగా ఉన్నప్పుడు దూరం కావన్న దైర్యం తో ఏది అడిగిన బెట్టు చేసే దాన్ని .......
నువ్వు దూరం గ వెళ్ళిన ఈ సమయం లో అప్పుడు నువ్వు అడిగిన ముచ్చట్లు అన్ని ముద్దు తిరేదాకా ఇచ్చేయాలిఅనిపిస్తుంది .
ఆశ పెడుతున్నాను అనుకుంటున్నావా?
ఇలా ఐన తొందరగా వచేస్తవని ఆశ పడుతున్నాను అంతే .
ఇంక నిన్ను ఎప్పుడు ఏడి పించను రా .......
నువ్వు కూడా నన్ను ఏడి పించక ............. వచ్చేయ రా ప్లీజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి