శుక్రవారం

ప్రియా


ప్రియా

కోయిల గొంతు విప్పి పాడడం కోసం వసంత కాలం వచ్చే వరకు వేచి ఉంటుంది .

ఇన్ని నాళ్ళ నా నిరీక్షణ చూసో లేక మరెందుకో నా హృదయం నాతో గొంతు విప్పే కాలం వచ్చుంటుంది .

అసలే సున్నితమైన విషయం ఆ పైన నేను ఆడదానిని కావడం చేతనేమో చాల కాలం తరువాత

కానీ నేనిలా మనసువిప్పలేక పోతున్నాను . తూకం తప్పని మాట , ఆత్మాస్తర్యం నిడిన చూపు ,

ఆకర్షించే హుందా తనం , కట్టి పడేసే చిరునవ్వు , సంస్కారం నిండిన పదజాలం , వెతికినా

కనపడని గర్వం ....... ఇలా చెప్పుకుంటూ పోయే కన్నా మగవారందరికిమీరు ఒక ఆదర్శం అంటే

సరి పోతుంది . మీతో ఏకాంతం గా మాట్లాడాలని ఉంది . ఇంతకూ మించి నేనేమి రాయలేను .

సమ్మతమైతే మన్నించి నా ఈ మెయిల్ కు రిప్లయ్ ఇవ్వండి . ఈదే నా తోలి మరియు చివరి

" పేరు లేని లేఖ "

సదా మిమల్ని అభిమానిస్తూ ......... మీ ........

గురువారం

ఏరా ఏమనుకుంటున్నావ్


ఏంట్రా ఆసలు ఏమనుకుంటున్నావ్ ?
నన్ను వదిలి వెళ్లి ఎన్నినాళ్ళు అయ్యింది .... ఒక్క ఫోన్ కాల్ ఐన చేసావా ?
ఒక్క ఉత్తర మైన రాసావా ?
అసలు నేను నీకు గుర్తున్నానా ?
.....కనీసం ఒక్కసారైనా గుర్తొచ్చానా ?
గుర్తు రాలేదని మాత్రం చెప్పకు .అబ్బద్దమైన పర్వాలేదు .
ఎప్పుడు నేనే గుర్తువస్తున్నాను అని చెప్పు .
నాకైతే ప్రతి క్షణం నీ ద్యసే .....
నిత్యం నీ జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తుంటే పరద్యనం లో ఉంటునాను అని తిడుతున్నారు అంత.
నీ కిష్టమైన నా కన్నులు నీ కోసం ఎదురు చూపులు చూస్తున్న ఈ .
నువ్వు దెగ్గరగా ఉన్నప్పుడు దూరం కావన్న దైర్యం తో ఏది అడిగిన బెట్టు చేసే దాన్ని .......
నువ్వు దూరం గ వెళ్ళిన ఈ సమయం లో అప్పుడు నువ్వు అడిగిన ముచ్చట్లు అన్ని ముద్దు తిరేదాకా ఇచ్చేయాలిఅనిపిస్తుంది .
ఆశ పెడుతున్నాను అనుకుంటున్నావా?
ఇలా ఐన తొందరగా వచేస్తవని ఆశ పడుతున్నాను అంతే .
ఇంక నిన్ను ఎప్పుడు ఏడి పించను రా .......
నువ్వు కూడా నన్ను ఏడి పించక ............. వచ్చేయ రా ప్లీజ్

ఇదిగో అమ్మాయి


ఇదిగో అమ్మాయి

స్టైల్ గా ఉండడానికి రోజు ఇస్త్రీ బట్టల ఖర్చు,

గ్లామర్ కనపడడానికి పౌడర్లు, క్రీముల ఖర్చు

నువ్వు
వచ్చే వరకు తోడూ ఉన్నా ఫ్రెండ్స్ కి టీ,సిగరెట్ ఖర్చు,

బండి లేక పొతే చుదరుగా - బండి ,బండికి పెట్రోలు ఖర్చు,

బావ రోజు నీ ఫిగర్ అదిరిందిరా అన్నా వెంటనే ఆనందంలో ఫ్రెండ్స్ కి పార్టీ ఖర్చు

నిన్ను
సంతోష పెట్టడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్ ఖర్చు

సెల్
ఫోన్ ల ఖర్చు

హీరో అనిపించుకోవడానికి బ్యాచ్ మొత్తానికి ఖర్చూ

అప్పుడప్పుడు ఫైట్స్ , దెబ్బలు తగిలించు కోవడాలు

నువ్వు ఒక్కవారం కనపడకపోతే దేవదాసు లా వేషం

అన్నం
సరిగ్గా తినక పోవడం

సరిగ్గా నిద్ర పట్టక పోవడం

అందరి
మీద చిరాకు పడడం

మీ
నాన్న , మీ అన్నా వర్నిగ్ లు ఇచ్చిన వెంట పడడం

ఇంత
ప్రయత్నించిన నువ్వు ప్రేమిస్తావో లేదో తెలియదు

పొద్దున్న
లేచిన దేగ్గరనుంది రాత్రి పడుకునే దాక ఎందుకు ఇంత టెన్షన్

నీ ప్రేమకు పెట్టె ఖర్చు బదులు

ఒక బీర్ తగి పడుకుంటే నువ్వు గుర్తు రావు .

టెన్షన్ ఉండదు .


ఉంటాను

ఏమి అనుకోమాక

నాది మిడిల్ డ్రాప్ .

మంగళవారం

మరణం


ఋతువులను గుర్తించనపుడు ప్రతిద్వానించనపుడు
ఓ వృక్షం మరణిస్తుంది
పారే దరి దొరకనప్పుడు దాహం తిర్చనపుడు
నీరు మరణిస్తుంది
ఒక్క పంటను పండించ నప్పుడు కొత్త పంటకు వెలుగు చూపనపుదు
భూమి మరణిస్తుంది
ఆశ్చర్యం సడలి నప్పుడు జీవనోస్తాహం ఉడిగి నప్పుడు
మనిషి మరణిస్తాడు

కవితక్షరాలు


నిట్టుర్పులతో గుండె పగుళ్ళు తీసి
దుక్కం గొంతు ముగా పోయినపుడు
కన్నీటి తీగలకు వికసించిన కవితాక్షర పూలు
పరిమళాలను
వేద జల్లి గయా పడ్డ గుండెకు
అమృత
స్పర్శను అందిస్తాయి
నా ప్రతి శ్వాస కవిత్వమై
జీవితమంతా కవిత్వం లో నే జీవిస్తాను
ఆగాధ
లోయలలోకి జారిన
వెంట పడిన కవిత స్పర్శ ఉయలుగిస్తుంది
నా
మస్తిష్కం లో
కవితక్షరాలు
కను మరుగైతే
జీవన
శ్వాస ఆగి మరణిస్తాను