
నువ్వు మిగిల్చిన ఏకాంతంలో,
నీవు పేర్చిన జ్ఞాపకాల
అరలని శోధిస్తున్నా..
అక్కడైనా నీ సన్నిధి దొరుకుతుందేమోనని..
నువ్వు విదిల్చిన ఒంటరితనంలో,
నీవు మరచిన ఊసుల
దొంతరలని చేధిస్తున్నా..
అక్కడైనా నీ ఊహల నిధి చేజిక్కుతుందేమోనని..
నీవు మిగిల్చిన నిశ్శబ్ధపు నీరవంలో,
నీవు విహరించిన కలల కైమోడ్పులైన
చక్షువులని తెరవలేకున్నా..
ఎక్కడ నీ రూపం మాయమవుతుందేమోనని..
నీవు విదిల్చిన అశ్రు తిమిరంలో,
నీకై ఎగసిన అలలకై అరమోడ్పులయిన
గవాక్షాలని మూయలేకున్నా..
ఎన్నడైనా నీ అడుగు నా ఎదలోకి ప్రవేశితమౌతుందేమోనని..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి