బుధవారం

కవిత చదివి మీ మనస్సును గాయపరచలేను


కవిత చదివి మీ మనస్సును గాయపరచలేను -

చదవకుండా నా మనస్సును క్షోభ పెట్టుకోను !

ఎదైనా, ఏమైనా కవిత చదివి చూస్తా -

పంచరత్న మాలికలను సంచిలోంచి తీస్తా !

అచ్చుకెపుడు నోచుకోని విచ్చుకవిత వినిపిస్తా -

కంగారేం పడకండి బంగారం నా కవిత !

కాకిపిల్ల కాకికెపుడు ముద్ధేనని అనకండి -

'అంత సీను ఉందా..?' అని అంతమాట అనకండి !

ముద్దుముద్దుగా చదివే 'మొద్దుపిల్లా' ననిపిస్తా -

యతిప్రాసలు కుదిరిస్తా.. మతులన్నీ పోగొడతా !

'వన్స్ మోర్ ' అనకున్నా రెండుసార్లు చదువుతా -

'వన్సే బోర్ ' అంటున్నా వత్తివత్తి పలుకుతా !

జనం నాకు కనిపిస్తే.. లోకం చూపిస్తాను -

మైకు చేతికొచ్చిందో.. మైకం కమ్మేస్తాను !

కెమెరా కనిపించిందో.. కేరింతలు కొడతాను -

విలేఖరే కనిపిస్తే.. వీరంగం ఆడతాను !

ఇన్సూరెన్స్ ఉంటేనే నా కవితలు వినండి -

లేకుంటే కష్టాలకు కారణం నేను కాను !

నా కవితలు విను బాస్... నీవే నా ' వై.యస్!' -

నా కవితను వినవయ్యా... నీవే నా 'రోశయ్య!' -

నా కవితను విను బాబూ... నీవే నా 'చంద్రబాబు!

'పిచ్చెత్తే నా కవితను అచ్చేయాలని ఉంది -

అచ్చోసిన కవినని అనిపించుకోవాలని ఉంది !

తోటి కవులందరిలో ఊదరగొడుతున్నానా -

సంఘటితంగా ఉంటే చెదరగొడుతున్నానా !

పల్టీ కొట్టిస్తున్నానని గిల్టీ లేనే లేదు -

ఎన్నో కవితలు ఉన్నవి - అన్నని వినిపించగలను...

అయినా చిన్నాభిన్నత్వంలో ఏకత్వం ఈ కవిత !

చప్పట్లే కొట్టనట్టి జన్మ ఎందుకయ్యా -

దుప్పట్లే కప్పనట్టి ఖర్మ ఎందుకయ్యా ?!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి