బుధవారం

ఏమి కన్నీళ్ళివి??


మనసంతా బాధగా ఉంది

గుండె అంతా బరువుగా ఉంది

ఎటు చూసినా చీకటే

ఏమి చేసిన ఓటమే

లేదా ఇంక నాకు గెలుపు

ఈ జీవితానికి రాదా ఒక మలుపు


అరే!!

ఏమి కన్నీళ్లివి?

ఎంత ఏడ్చినా తరగవేమి?

ఏమి కన్నీళ్లివి?

ఎంత ఓదార్చినా ఆగవేమి?

చిన్ని గాయానికే

జలజలా వర్షిస్తాయి!

చిన్న ఎడబాటుకే

వరదలై ఉరికొస్తాయి!


అరే!! అరే!!

ఏంటి ఇదంతా...

ఎంత రోదించినా తరగవా??

ఎన్నేళ్ళు విలపించినా ఆగవా???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి