యువకుల ప్రేమ :-
వయ్యారి గోదారి - చూసాను నిన్నే తొలిసారి
వచ్చాను నీ దరిచేరి - తలచాను నీ పేరుకోరి
పిలిచాను నీ మనసుకోరి - పలుకవే ఒక్కసారి
నా మనసులో ఏరై పారి - కదిలించవే నన్ను ప్రతిసారి !
నువ్వే నా రాజకుమారి - కాదనకే ఓ నారి
కలలు కన్నాను నీపై భారి - వమ్ము చేయకే నోరుజారి
నీ పిలుపే ప్రేమగా మారి - చూపవే నాకు దారి
విన్నవిస్తున్నా తొలిసారి - అర్థంచేసుకో నన్నొకసారి !
నీ మాటలే తేనెలా కారి - పులకించవే ఓ చిన్నారి
ప్రవర్తించలేదు హద్ధు మీరి - అందుకే నీపై ఇంత గురి
అడుగుతున్నాను కడసారి - కాదంటే చూస్తాను వేరే దారి
కడలిపై కడతాను నీకో గోరి - పూజిస్తానొక హంతకుడిగా మారి !
నా ఊహల్లో నువ్వే ప్యారి - ఇదంతా తప్పుగా భావిస్తే అయాం సారీ !!
యువతుల ప్రేమ :-
అందాల ఓ మగధీరా... చదివానులే నీ కవిత మనసారా
వ్రాస్తున్నాను ఈ కవిత ప్రేమారా -
అయినా కలగక మానలేదు సందేహమేరా
ఎంతగా చూశావో కళ్ళారా - అంతగా పొగిడావు మనసారా
నువ్వే నా రాజకుమారా - గెలుపొంది నన్నేలుకోరా
తీగలా వచ్చి నన్నల్లుకోరా -ముద్దుగా మురిపించి పలికించుకోరా !
విన్నవిస్తాను పెద్దలకు ప్రేమారా -ఒప్పుకుంటే మన ప్రేమకు జయములేరా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి