ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది....
ఎంతో ఆతృతగా చూసే నాకు
ఒక అందమైన దృశ్యం కనిపించింది....
నీలి మేఘాల్లాంటి కురులు..
చూడగానే చెలిమి చేయాలనిపించే కళ్ళు..
మండుటెండల్లో మంచులాంటి చిరునవ్వు..
మకరందాన్ని మరపించే మధురస్వరం..
చంద్రబింబంలా అనిపించే ముఖారవిందం..
మానవత్వానికి మారుపేరు ఆ మనసు..
సంగీతాన్ని మైమరపించే ఆ అందెల సవ్వడి..
మొత్తంగా అజంతాశిల్పమా అనిపించే ఆ రూపం..
అందానికే మారుపేరనిపించే ఆ చిత్రం..
కాదనగలనా కేవలం అది మా అమ్మ ప్రతిబింబం.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసాను -
అంతా శూన్యం...
నా కనులలో అంత అందమైన కలా ?!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి