ఏంటి.. ఏమన్నావు??
నేను ఎవరినో నీకు తెలీదా??
నన్నెప్పుడు నువ్వు చూడలేదా??
నువ్వే నా ప్రాణమని అన్నావు కదా ఆ రోజు -
మరి ఈ రోజు ఏంటి నా ప్రాణాలు తీయకు.. తప్పుకో అంటున్నావ్..
నీతో మాట్లాడకపోతే అసల రోజే గడవదు అన్నావు -
ఇప్పుడు మాట్లాడితే ఏమీ చెయ్యలేను.. ఆగిపో అంటున్నావ్..
నువ్వంటే ఇష్టం, ప్రాణం అన్నావు కదా అప్పుడు -
నువ్వుంటే కష్టం, ప్రణయం అంటున్నావ్ ఎందుకు..
నీవుంటే "నాకెవ్వరూ" వద్దు అన్న స్వరంతో
ఇంతకీ "నీవెవరివో" అని ఎలా అనగలుగుతున్నావ్??
దగ్గరికి తీసుకుని "బంగారం" అని హత్తుకున్న చేతులతో
దూరంగా వెళ్ళిపో "చండాలం" అని ఎలా విసిరేయగలుగుతున్నావ్??
ఒకే మనిషిలో ఇంతటి మార్పు నేనెప్పుడూ చూడలేదే..
నా మనసుకి కూడా ఇంత బాధ ఉంటుంది అని నాకెప్పుడు తెలియలేదే..
నీ పరిచయంతో తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను..
నా చెంత ఉన్న ఆనందాలు అన్నింటినీ కన్నీరుగా మార్చుకున్నాను..
రోజూ నీ ఙ్ఞాపకాల నరకంలో చస్తున్నాను..
అలా చస్తూ కూడా నవ్వుతూ బతికేస్తున్నాను..
ఇప్పుడు చెప్పు -
నేన్నెవరో నీకు తెలీదా.. నన్నెప్పుడూ నువ్వు చూడలేదా..
ఓ ప్రియా.. నీకు జోహారు
నీ ఈ ప్రేమకు.. నా కృతఙ్ఞతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి