బుధవారం

వర్షం కురిసిన వేళ..



నింగి
పెదవి ముద్దు తునకలు.. చినుకులల్లే నేల తాకెనా??
తడి తనువు సిగ్గు దాచగా.. మబ్బు చీర చీకటాయెనా??
చిరుగాలి చెలికాడుగా మారి.. చెక్కిళ్ళు గిల్లిపోయెనా??
నాలో నేడు వాన చలి సెగలు రేపెనా??



నా నవ్వు చూసి పూలు పూయనన్నవి
నా సొగసు చూసి తారలు మెరువనన్నవి
వానా.. నీవైనా చెప్పరాదా వింత ఏమిటో?
నాలో మొదలయిన మత్తు ఎందుకో??


నడకలన్నీ వయ్యారమవుతున్నాయి
అడుగులన్నీ మయూరమై నాట్యమాడుతున్నాయి..


పగటి కలలే నిండిపోయె కనులలో ఎందుకో?
వేడి సెగలే మొదలయ్యే తనువులో ఏమిటో?
ఊహలన్నీ వరమా?

ఇవి ఆపుట నా తరమా??


వానా.. ఇకనైనా చాలించమ్మా నీ అల్లరి
ఏమైపోతానో చూడాలి నేను రాతిరి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి