ఆ నవ్వు వింటే చాలు -
ఎక్కడో కొమ్మచాటు ఉన్న కోయిల,
గొంతెత్తి సరిగమలు ఆలపించేది...
ఆ నవ్వు చూస్తే చాలు -
ఎవరి రాకకోసమో అనట్టుగా ఉన్న నెమలి,
పురి విప్పి పరవశంతో నాట్యం చేసెది...
ఆ నవ్వు కనబడితే చాలు -
మోడుబారి దిగులుగా ఉన్న హృదయం,
ఆనందంతో, ఆహ్లాదంతో ఉప్పొంగిపోయేది ...
కాని ఇప్పుడు, ఆ నవ్వు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపొయింది..
మళ్ళీ -
ఆ కోయిల గొంతు మూగబోయింది..
ఆ నెమలి నాట్యం ఆగిపోయింది..
ఆ ఉప్పొంగిన హృదయం మోడుబారింది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి