బుధవారం

నువ్వు కావాలి... నీ తోడు కావాలి...


ఓయ్..!!

నాకు ఆకాశం.. అందులో చుక్కలు..
ఇంకా ఆ మబ్బుల్లో చినుకులు మొత్తం కావాలి..
నాకు అవ్వన్నీ నువ్వు తెచ్చిస్తావా?? ఇవ్వగలవా??
అయిన అసలు నాకేం కావాలో నీకు తెలుసా??
తెలీకుండా ఏది కావాలి అంటే అది ఇస్తాను అని ఎలా చెప్తున్నావు??
ఇంతకీ నాకు ఏమి కావాలి అంటే...

నా కన్నీళ్ళు దోసిల్లలో పట్టే చేతులు నాకొద్దు,
అవి తుడిచే వేళ్ళు చాలు...
కలకాలం బతికించే అమృతం నాకొద్దు,
ఆ క్షణమే జీవితం అనిపించే - ఒక్క క్షణం చాలు...
ఓటమే ఎరుగని గెలుపులు నాకొద్దు,
ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా - నాతో నడిచే ఒక్క అడుగు చాలు...

కొంచం ప్రేమ... కొంచం అనురాగం...
కొంచం ధైర్యం... కొంచం చిరునవ్వు...
ఇవ్వన్నీ ఉన్న నువ్వు కావాలి... నీ తోడు కావాలి...

ఇప్పుడు చెప్పు నాకు కావల్సింది నువ్వు ఇవ్వగలవా???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి